ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

-

ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు కరీంనగర్ లో మేయర్, కార్పొరేటర్లు బీజేపీలో చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేపు నాలుగు కొత్త పథకాలు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తమవుతున్న సందర్భంలో.. ఇళ్ల పథకానికి ఇందిరమ్మ పేరు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని అన్నారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామని తేల్చి చెప్పారు బండి సంజయ్. అలాగే కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు కూడా ఇవ్వబోమని అన్నారు. తాము ముద్రించి ప్రజలకు కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు బండి. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులు, చేసిన అభివృద్ధిని గుర్తించి కరీంనగర్ నేతలు బిజెపిలో చేరడం సంతోషమన్నారు.

బిఆర్ఎస్ హయాంలో చాలా ఇబ్బందులు పెట్టారని.. రాజకీయ ఒత్తిళ్లతో బిఆర్ఎస్ లో ఉన్న సునీల్ రావు కూడా ఏం చేయలేకపోయారని అన్నారు. ఫార్ములా – ఈ రేసు కేసులో కేటీఆర్ ని ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ సహా బీఆర్ఎస్ నేతలపై పెట్టిన కేసులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news