ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటన పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం లో శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం కొన్ని మీటర్ల మేర కుప్పకూలింది. ఆ సమయంలో అక్కడే పనికి వెళ్లిన కొందరు కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. వారికి బయటికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
దీనికోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి, టన్నెల్ లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర సిబ్బంది కూడా తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ.. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలో SLBC పైకప్పు కూలిపోయిన విషాద సంఘటన తెలిసి దిగ్భ్రాంతి చెందానని తెలిపారు. అలాగే ఈ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికుల క్షేమం కోసం, భద్రత కోసం దేవుడిని ప్రార్థించారు.