వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయి : కిషన్ రెడ్డి

-

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలుస్తాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాలో తూ తూ మంత్రంగా రుణమాఫీ జరిగిందన్నారు. తొమ్మిదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ఇది అసమర్థత ప్రభుత్వం అని పేర్కొన్నారు. పోలీసు అధికారులను తమ కనుసన్నల్లో పని చేసే విధంగా చేసుకున్నారు. 

రాజకీయ ప్రత్యర్ధులు మీద ఖమ్మం జిల్లాలో దాడులు చేశారు. అక్రమాలను ప్రశ్నించే వారిని మంత్రి అజయ్ కుమార్ వేధింపుల కు పాలడుతున్నారు. కమ్యునిస్టు పార్టీ లో పుట్టిన వ్యక్తి ఎలా ఎంత  సంపాదించాడు. మంత్రి సొంత  వారిని వేదింపులకు పాల్పడ్డారు అని తెలిపారు. ఇది ఆయనకు మంచిది కాదు అని..ప్రజల ముందు ఎక్కువ రోజులు మభ్య పెట్టలేరు అన్నారు. ఎంతో మందిని మనం చూశాం..ప్రజలు కూకటి వెళ్ళ తో పెగలించి వేస్తారు. ప్రజల ముందు కుప్పి గంతులు వేయవద్దు అన్నారు కిషన్ రెడ్డి. రానున్న ఎన్నికలలో ప్రజల వ్యతిరేకత తో పలితం చూస్తారు. 27న  అమిత్ షా ఖమ్మం వచ్చే అవకాశం వుంది. బహిరంగ సభ జరుగుతుందని తెలిపారు కిషన్ రెడ్డి. 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version