తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. అమెరికాను మించేలా తెలంగాణలో రహదారులు ఉన్నాయని చెప్పారు. కాళేశ్వరం తో హైదరాబాద్ కి నీటి సమస్య పరిస్కారం అవుతుందని వెల్లడించారు. ఇవాళ రెండు జాతీయ రహదారులను ప్రారంభించి 10 జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పెద్దపల్లి జిల్లా జిల్లా తప్ప అన్ని జిల్లాలు జాతీయ రహదారులతో అనుసంధానం అయ్యాయని వెల్లడించారు. 5 ఎక్స్ప్రెస్ హైవే లు తెలంగాణ నుండి వెళ్తున్నాయని… రీజినల్ రింగ్ రోడ్ పనుల శంకుస్థాపనకి మళ్ళీ వస్తానని పేర్కొన్నారు. నేను జల వనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం తో కాళేశ్వరం పై మాట్లాడానని గుర్తు చేశారు. తెలంగాణ శక్తి శాలి అయితేనే భారత్ శక్తి శాలి అవుతుందని.. తెలంగాణ రోడ్ల నిర్మాణం అమెరికా రోడ్ల దీటుగా ఉంటుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.