Uppal, Nagol, Boduppal, LB Nagar roads are all traffic jam: ఉప్పల్, నాగోల్, బోడుప్పల్, LB నగర్ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. సంక్రాంతి పండగ సందర్భంగా నగరవాసులంతా పల్లె బాట పట్టారు. పండగ ట్రాఫిక్ తో ఉప్పల్ రింగ్ రోడ్డు ట్రాఫిక్ మయం అయింది. దింతో రోడ్లన్నీ ట్రాఫిక్ తో స్తంభించిపోయాయి. తెలంగాణ లోని సొంత ఊర్లకు వెళ్లే వారు దాదాపుగా ఆర్టీసీ బస్సులను, సొంత వాహనాలను, ప్రయివేటు ట్రావెల్స్ నీ ఆశ్రయిస్తున్నారు.
ఒక్కసారిగా ఓన్ వెహికల్స్ అన్ని రోడ్ ఎక్కడంతో రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి…ఉప్పల్ మీదుగా ఇటు విజయవాడ, గుంటూరు, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి, జనగాం రూట్ లకు ప్రయాణం అవుతున్నారు. ఎప్పుడు అరకొర జనాలతో ఉండే ఉప్పల్ స్కై వే కూడా జనాలతో నిండిపోయింది. ఉప్పల్, నాగోల్, బోడుప్పల్, LB నగర్ రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయింది.