సంక్రాంతి స్పెషల్.. సీఎం రేవంత్ ఫోటోతో పతంగులు

-

సంక్రాంతి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది పతంగులు. చాలా మంది సరదాగా గాలిపటాలు ఏగరేస్తుంటారు. పండుగ వేళ పతంగులకు ఉండే క్రేజే వేరు. ఇక రంగురంగుల పతంగులు గాల్లో ఎగురుతుంటే చాలా అందంగా కనిపిస్తుంటాయి. చిన్నారులు అరుస్తూ సంబురంగా పతంగులను ఎగరేస్తుంటారు. పండుగ టైంలో రకరకాల సినిమా హీరోలు, మూవీస్, కార్టున్ బొమ్మలతో గాలిపటాలు దర్శనమిస్తుంటాయి.

కానీ, ఈసారి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో గాలిపటాలు మార్కెట్లోకి వచ్చాయి. రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సీఎం రేవంత్ రెడ్ది ఫోటోతో కూడిన పతంగులను తయారు చేయించి పిల్లలకు ఉచితంగా పంపిణీ చేస్తూ తన అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో సీఎం బర్త్ డే సందర్భంగా పూరి తీరంలో రేవంత్ రెడ్డి సైకత శిల్పాన్ని తయారు చేయించిన సాయికుమార్.. ఈసారి సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ ఫోటోతో కూడిన గాలిపటాలను తయారు చేయించారు.

Read more RELATED
Recommended to you

Latest news