మేడిగడ్డ లెక్కనే..అన్నారం ప్రమాదంలో ఉంది – ఉత్తమ్‌

-

మేడిగడ్డ లెక్కనే..అన్నారం ప్రమాదంలో ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. నేడు అసెంబ్లీలో సాగునీటి శాఖపై కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేసింది. ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్వేతపత్రం పెట్టాలని ప్రభుత్వం భావించిందని.. కాళేశ్వరం లో మేడిగడ్డ కీలక బ్యారేజ్ అని తెలిపారు.దురదృష్టవశాత్తు నాణ్యత లోపం.. తో కుంగిపోయిందని పేర్కొన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీని విచారణ జరిపించాలని కోరామన్నారు.

uttam statement on annaram

అన్నారం ప్రాజెక్టులోనూ లీకులు ఉన్నాయని బాంబ్‌ పేల్చారు ఉత్తమ్. అన్నారంలో కూడా నిన్నటి నుంచి లీకేజీలు పెరిగాయని.. కట్టిన వాళ్ళు క్షమాపణ చెప్పాల్సింది పోయి మాపై ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహించారు. అన్నారంకు ndsa వాళ్ళు రెండు రోజుల్లో వస్తారన్నారు. అన్నారంలో లీకేజీ లు నిన్నటి నుండి పెరిగింది…అన్నారం లో కూడా క్రాక్స్ ఉన్నాయని చెప్పారు. మేడిగడ్డ లెక్కనే.. అన్నారం ప్రమాదంలో ఉందని ndsa చెప్పిందన్నారు ఉత్తమ్. కాలేశ్వరంలో జరిగినంత అవినీతి దేశంలో ఎప్పుడు ఎక్కడ జరగలేదని ఆరోపణలు చేశారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version