మాజీ సీఎం కేసీఆర్‌ గవర్నర్ తమిళి సై శుభాకాంక్షలు

-

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్. BRS పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి KCR జన్మదినం సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కార్యాలయం నుండి వచ్చిన ప్రతినిధి తెలంగాణ భవన్ లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పుష్పగుచ్ఛం, శుభాకాంక్షల లేఖను అందజేశారు.

కాగా, తెలంగాణ మొట్ట మొదటి సీఎం కేసీఆర్‌ బర్త్‌ డే నేడు. మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 17, 1954లో సిద్దిపేట సమీపంలోని చింతమడక గ్రామంలో జన్మించారు. చదువులో చురుగ్గా ఉన్న ఆయన రాజకీయాలపై ఆసక్తితో యూత్ కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. 1983లో టీడీపీలో చేరి 1985 నుంచి ఓటమి ఎరుగని నేతగా నిలిచారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే లక్ష్యంగా 2001లో టీఆర్ఎస్ ని స్థాపించారు. మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణకు తొలి సీఎంగా 9 ఏళ్ల పాటు సేవలందించారు. కేసీఆర్‌ బర్త్‌ డే నేడు ఉన్న తరుణంలోనే.. తెలంగాణలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version