రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. ప్రసాద్ స్కీం పరిధిలో వేములవాడ రాజన్న ఆలయం స్థానం దక్కించుకుందని సమాచారం.ఇందులో భాగంగానే… కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవతో రాజన్న ఆలయాన్ని సందర్శించింది కేంద్ర ఆర్కిటెక్చర్ బృందం. వేములవాడ రాజన్న ఆలయం మాస్టర్ ప్లాన్ తో పాటు పరిసరాలన్నింటినీ పరిశీలించింది ఆర్కిటెక్చర్ బృందం.
రాజన్న ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించిన బండి సంజయ్…ప్రసాద్ స్కీం పరిధిలోకి వేములవాడ రాజన్న ఆలయం స్థానం దక్కేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. తాజాగా
కేంద్ర ఆర్కిటెక్చర్ బృందం కిషోర్ కుమార్, మౌనిక, రాష్ట్ర దేవాదాయశాఖ ఎస్ఈ దుర్గాప్రసాద్, దేవాదాయ స్థపతి వల్లిన యాగం, ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఈఈ రాజేశ్, డిఈ రఘునందన్ అధికారులు…రాజన్న సన్నిధిలో పరిశీలించారు. మరి ప్రసాద్ స్కీం పరిధిలోవేములవాడ రాజన్న ఆలయం స్థానం దక్కించుకుందా లేదా అనేది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.