వెంకట్ రెడ్డి మాటలు బాధించాయి – పాల్వాయి స్రవంతి

-

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న భువనగిరికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని గతంలోనే కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో చెప్పినట్లుగా ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా మరోసారి వెంకట్ రెడ్డికి సంబంధించిన ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఓ కాంగ్రెస్ లీడర్ తో మాట్లాడిన సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఆడియో పై మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి స్పందించారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని అన్నలా భావించానని, అండగా ఉంటారు అనుకున్నాను కానీ వెంకట్ రెడ్డి మాటలు చాలా బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండానే ఎగురుతోందన్నారు. నాకు ధన బలం లేకపోవచ్చు కానీ.. ప్రజాబలం ఉందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు పాల్వాయి స్రవంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version