రేపు లవర్స్ డి ఉన్న నేపథ్యంలో వీ.హెచ్.పి, భజరంగ్ దళ్ ప్రేమికులకు వార్నింగ్ ఇచ్చింది. తాము ప్రేమికులకు కాదు.. విదేశీ విష సంస్కృతికి వ్యతిరేకమన్నారు. ఇది ఒక విష సంస్కృతి, ప్రభుత్వాలు కూడా వాలంటైన్స్ డే ను నిషేధించాలని డిమాండ్ చేశారు. మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలన్నారు.
ప్రేమికుల రోజు పేరు తో యువత ఎవరైనా ఫిబ్రవరి 14న విచ్చలవిడి గా బయట తిరిగితే వారికి కౌన్సిలింగ్ ఇస్తామని.. భజరంగ్ దళ్ కార్య కర్తలు అని చెప్పుకొని కొందరు ప్రేమికుల రోజు న యువతి, యువకులు కు పెళ్లి లు చేస్తున్నారన్నారు. వాలంటైన్స్ డే అనే విదేశీ సంస్కృతి నీ కొన్ని కార్పొరేట్ కంపెనీలు మన దేశం పై రుద్దాలని చూస్తున్నారు.
ప్రేమికుల రోజు జరుపవద్దని పబ్బులు, రెస్టారెంట్లు, రిసార్ట్స్ లను హెచ్చరిస్తున్నామని.. యువతలో జాతీయ వాదాన్ని పెంపొందించడానికి ప్రేమికుల రోజు వ్యతిరేకిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 12న రాష్ట్ర వ్యాప్తంగా గ్రీటింగ్ కార్డుల దహనం చేస్తామని.. పుల్వామ లో అమరులైనాన సైనికుల ను స్మరిస్తూ ” అమర జావాన్ డివాస్ ” గా జరుపుకోవాలని పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు. ప్రేమికులపై దాడులు చేయం.. వారు బయట కనిపిస్తే.. అమరవీరుల పై అవగాహన కల్పిస్తామని తెలిపారు.