”నాతో పెట్టుకున్నోడు ఎవ్వ‌డు మిగ‌ల‌లేదు”.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆడియో వైర‌ల్

-

”నాతో పెట్టుకున్నోడు ఎవ్వ‌డు మిగ‌ల‌లేదు.. నీవు న‌న్ను ఏం చేయ‌లేవు.. ఇంకా ముప్పై ఏండ్లు రాజ‌కీయాల్లో ఉంటా.. నిన్ను సిద్దుల గుట్ల నాశానం చేస్తుంది” అంటూ మాజీ జ‌డ్పీటీసీ భ‌ర్త పై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి విరుచుకుప‌డ్డారు. కాగ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాక్లూర్ మాజీ జ‌డ్పీటీసీ ల‌త భర్త పీర్ సింగ్ పై ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి ఫోన్ లోనే బూతు పుర‌ణం అందుకున్నారు. పీర్ సింగ్ సోద‌రుడు త‌నకు వ్య‌తిరేకంగా మాట్లాడ‌టంతో.. పీర్ సింగ్ పై ఎమ్మెల్యే ఫోన్ లోనే బూతు పురాణం పెట్టారు.

కాగ ఆ ఆడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగ ఆర్మూర్ నియోజక వ‌ర్గంలో టీఆర్ఎస్ నాయ‌కుల మ‌ధ్య గ‌త కొద్ది రోజుల నుంచి వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే పైనే విమ‌ర్శలు గుప్పిస్తున్నారు. కాగ పీర్ సింగ్ కూడా సోషల్ మీడియా ద్వారా ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేయ‌డంపై జీవ‌న్ రెడ్డి ఆగ్ర‌హించారు. పీర్ సింగ్ కు ఫోన్ చేసి.. ”నీ భ‌ర్య‌కు జ‌డ్పీటీసీ గా గెలిపించా.. స్థాయి సంఘం చైర్మెన్ ను చేశా.. నీకు పంప్ ఆప‌రేట‌ర్ ఉద్యోగం ఇప్పించా.. ట్రాక్ట‌ర్, హార్వేస్ట‌ర్ ఇప్పించా అని అన్నారు. అయినా త‌నపై ఆరోప‌ణ‌లు చేస్తారా” అని అన్నారు.

”తెర చాటున మీ స‌ర్పంచ్.. నీవు చేసు బాగోతాలు నాకు తెలుసు బిడ్డా.. ఇంకా ముప్పై ఏళ్లు రాజ‌కీయాల్లో ఉంటా. నాతో పెట్టుకున్నోడు ఎవ్వ‌డు మిగ‌ల‌లేదు” అంటూ బూతు పుర‌ణం సాగించారు. త‌న‌కు ఏం తేల‌వ‌దని పీర్ సింగ్ అన్నా.. ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి మాత్రం త‌న బూతు పుర‌ణం అప‌లేదు. కాగ ఈ ఆడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైర‌ల్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version