ప్రస్తుతం కరోనా వ్యాప్తి.. వైరస్ బారి నుంచి బయటపడటంపై తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
‘‘రెండున్నర ఏళ్ల నుంచి కొవిడ్ మహమ్మారి మానవజాతి మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది. మనం అందించిన సేవల వల్ల కరోనా నుంచి బయట పడలేదు. ఏసుక్రీస్తు కృప, దయవల్లే కరోనా తగ్గింది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో డీహెచ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
అయితే, జీసస్ వల్లే కరోనా తగ్గింది అంటూ తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శ్రీనివాసరావు వాక్యాలపై విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. డిహెచ్ పై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేసింది. శ్రీనివాసరావును డిహెచ్ పదవి నుంచి తక్షణం తొలగించాలని ప్రభుత్వాన్ని కోరింది. అయితే తన వ్యాఖ్యాలను మీడియా వక్రీకరించిందంటూ డిహెచ్ వివరణ ఇచ్చారు.