తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి వివాదస్పద పోస్ట్ చేశారు. 2007 సంవత్సరంలో మొదటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరిగిందని విజయశాంతి తెలిపారు. బడుగు, బలహీన, సబ్బండ వర్గాల తల్లి ప్రతిరూపంగా బీఎస్ రాములు చిత్రీకరించారని వెల్లడించారు. బీఆర్ఎస్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగిందన్నారు.
కానీ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ అధికారికంగా తెలంగాణ తల్లి రూపానికి హోదా, గౌరవం, నిర్దేశ విధానాలు కల్పించలేదని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ తల్లిని మార్చిందని కొట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి.
బీఆర్ఎస్ వంటి రాజకీయ పార్టీ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి రూపం మార్పుపై ఆ పార్టీ కొట్లాడితే….. ఆ హక్కు వారికి ఎక్కడున్నది? అని తెలిపారు. తల్లి తెలంగాణ విగ్రహ రూపాన్ని బిఆర్ఎస్ మార్చిందని నాటి మన తెలంగాణా ఉద్యమకారులు కూడా కొట్లాడవచ్చు అంటూ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి.
2007 సంవత్సరంల మొదటి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ , నాడు తల్లి తెలంగాణ పార్టీ కార్యాచరణల …..
బడుగు, బలహీన, సబ్బండ వర్గాల తల్లి ప్రతిరూపంగా గౌరవనీయ బిఎస్ రాములు గారి చిత్రీకరణతో ఏర్పడ్డది.అప్పటికి నాటి టిఆర్ఎస్, నేటి బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన బహుశా… pic.twitter.com/N6OybU6dzh
— VIJAYASHANTHI (@vijayashanthi_m) December 16, 2024