కేసీఆర్ తుగ్లక్ పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడదాం – విజయశాంతి

-

కేసీఆర్ తుగ్లక్ పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడదామని విజయశాంతి పేర్కొన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణ‌యాల వ‌ల్ల తెలంగాణ ఆగం అవుతోంది. రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళన చేస్తాన‌ని బీరాలు ప‌లికిన కేసీఆర్… ధ‌ర‌ణితో రైతుల నెత్తిన గుదిబండ‌ మోపాడని ఫైర్‌ అయ్యారు. రాష్ట్ర స‌ర్కార్ వీఆర్వో వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేసి 22 నెల‌లు అవుతుంది. ఆ వీఆర్వోల ప‌రిస్థితి ఆగ‌మ్య గోచరంగా ఉంది. దీనిపై వారు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎన్నిసార్లు తమ సమస్యను విన్నవించినా లాభం లేకుండా పోయిందని ఆగ్రహించారు.

ఈ 22 నెలల కాలంలో సీఎస్ సోమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసేందుకు అపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అడుగుతున్నప్పటికీ ఇవ్వలేదు. రాష్ట్రంలో విధి నిర్వహణలో ఉండగా దాదాపు 200 మంది వీఆర్వోలు చనిపోయారు. రోడ్డున పడ్డ ఆ కుటుంబాలవారికి కారుణ్య నియామకాలు చేపట్టకపోవడం అమానుషం. వీఆర్వో వ్యవస్థ రద్దు చేయడంతో పాటు భూములకు సంబంధించిన విధులను వీఆర్వోలు నిర్వహించొద్దని సీఎం కేసీఆర్ ఆదేశాలిచారు. ఇప్పుడు పే స్కేల్ వర్తింపజేయాలనే డిమాండ్​తో జులై 25 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు వీఆర్ఏ సంఘాల జేఏసీ తెలిపింది. కేసీఆర్ పిచ్చి నిర్ణ‌యాల వ‌ల్ల రెవెన్యూ వ్య‌వ‌స్థ‌ అన్నదే లేకుండా పోయే పరిస్థితి తలెత్తింది. ఇప్ప‌టికైనా వీఆర్వోలను విధుల్లోకి తీసుకోవాలని బీజేపీ పార్టీ త‌రఫున డిమాండ్ చేస్తున్నం. కేసీఆర్ సర్కార్ తుగ్లక్ పాల‌న‌కు చ‌ర‌మ గీతం పాడేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు విజ‌య‌శాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version