తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ దేవస్థానం బోర్డు శుభవార్త చెప్పింది. తిరుమల తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు కొత్తగా శనగపప్పు గారెలును వడ్డించనున్నారు. దీనికి సంబంధించిన వడ్డింపు కార్యక్రమాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ, అదనపు ఈఓ గురువారం ఉదయం ప్రారంభించారు.
అంతేకాకుండా, భక్తులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా గారెలు వడ్డించారు. గతంలో అన్నప్రసాద కేంద్రంలోని మెనులో శనగపప్పు గారెలను చేర్చలేదు. కొత్తగా చేర్చడంతో భక్తులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా, గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న తప్పిదాలను రిపీట్ కాకుండా చూడాలని టీటీడీ కృతనిశ్చయంతో ఉందని చైర్మన్ ప్రకటించారు.
https://twitter.com/bigtvtelugu/status/1897536443448483974