నేను కామారెడ్డి నుంచి పోటీ చేయాలని డిమాండ్ వినిపిస్తుందని బీజేపీ నేత విజయశాంతి కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు విజయశాంతి. బీఆర్ఎస్ పార్టీ పై రాజీలేని పోరాటం చేయడంలో బీజేపీ వెనక్కు తగ్గదు.. అని కార్యకర్తల విశ్వాసం అంటూ వెల్లడించారు రాములమ్మ.

అందుకు, గజ్వేల్ నుండి బండి సంజయ్ గారు, కామారెడ్డి నుండి నేను అసెంబ్లీకి కేసీఆర్ గారిపై పోటీ చెయ్యాలని గత కొన్ని రోజుల మీడియా సమాచారం దృష్ట్యా, కార్యకర్తలు అడగటం తప్పు కాదని వెల్లడించారు విజయశాంతి. అసెంబ్లీ ఎన్నికల పోటీ నా ఉద్దేశ్యం కానప్పటికీ… వ్యూహాత్మక నిర్ణయాలు ఎన్నడైనా పార్టీ నిర్దేశితమే అన్నది సత్యమైన వాస్తవం అంటూ పోస్ట్ పెట్టారు విజయశాంతి. కాగా సీఎం కేసీఆర్ గజ్వేల్ మరియు కామారెడ్డి నియోజక వర్గాల నుంచి ఈ సారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.