నేడు ఇజ్రాయెల్‌ వెళ్లనున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌

-

ఇజ్రాయెల్-హమాస్​ల మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రం అవుతోంది. ఓవైపు ఇజ్రాయెల్​పై హమాస్ భీకర యుద్ధం చేస్తోంటే.. మరోవైపు ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులతో విరుచుకు పడుతోంది. ఇరు వర్గాల మధ్య యుద్ధం ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. హమాస్‌ దాడులతో దద్దరిల్లుతున్న ఇజ్రాయెల్‌ యుద్ధభూమిలో ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పర్యటించనున్నారు.

ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలపడంతో పాటు ఉగ్రవాదుల ఏరివేతలో అండగా నిలుస్తామన్న సందేశాన్ని బైడెన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గాజాలో మానవతా సంక్షోభాన్ని నివారించడానికి  అమెరికా అధ్యక్షుడు జోర్డాన్, ఈజిప్టు, పాలస్తీనా అధ్యక్షులతో చర్చలు జరపనున్నట్లు శ్వేతసౌధం తెలిపింది. ఇందుకోసం బైడెన్‌ జోర్డాన్‌లో ఆయా దేశాధినేతలతో చర్చలు జరపనున్నట్లు పేర్కొంది.

తాను బుధవారం ఇజ్రాయెల్‌ వెళ్తున్నట్లు బైడెన్‌ కూడా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. హమాస్‌ ఉగ్రవాదుల ఎదుర్కొనేందుకు ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా నిలుస్తామని పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజల గౌరవం, స్వీయనిర్ణయాధికారాన్ని హమాస్ ప్రతిబింబించదని  స్పష్టం చేశారు. గాజాకు మానవతా సాయంపై ప్రధాని నెతన్యాహుతో బైడెన్‌ చర్చలు జరుపుతారని ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news