మాజీ సీఎం కేసీఆర్‌ పై విజయశాంతి ప్రశంసలు !

-

మాజీ సీఎం కేసీఆర్‌ పై విజయశాంతి ప్రశంసలు కురిపించారు. ఇద్దరే ఎంపీలుగా తెలంగాణకై కొట్లాడిన నాటినుండి మా మధ్య విధానపరంగా అనేక వ్యతిరేకతలు ఉన్నా, నేను అన్నా అని పిలిచి, గౌరవంతో కలిసి పనిచేసిన కేసీఆర్ గారు తానే స్వయంగా ఎమ్మెల్యేగా కూడా ఓటమి పొందిన స్థితికి తెలంగాణ ల బీఆర్ఎస్ పార్టీ ని ఇయ్యాల తెచ్చుకోవడం బాధాకరం అన్నారు విజయశాంతి.

Vijayashanti praises former CM KCR
Vijayashanti praises former CM KCR

మొదట కేసిఆర్ గారు ఎన్నో పర్యాయాలు చెప్పినట్లుగా తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, కాదంటే 2018 ఎన్నికల తర్వాత కావచ్చు, పదవికి దూరంగా ఉంటే ఇయ్యాల్టి ఈ పరిణామాలు వారికి ఉండక పోయి ఉండవచ్చు అని చెప్పారు. ఏది ఏమైనా ఏర్పడనున్న కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల గౌరవంతో కూడిన ప్రతిపక్ష హుందాతనాన్ని కేసీఆర్ గారు, బీఆర్ఎస్ నుండి తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్నదని వివరించారు విజయ శాంతి.

Read more RELATED
Recommended to you

Latest news