చంద్రబాబుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు…షాక్‌ తో రేవంత్‌ !

-

చంద్రబాబుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారని వివరించారు. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే చంద్రబాబు గారి రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే, తెలంగాణాలో మళ్లీ తెలుగుదేశం పార్టీ విస్తరిస్తుందని చంద్రబాబు గారు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ అంటూ ఫైర్‌ అయ్యారు విజయశాంతి.

Vijayashanti’s sensational comments on Chandrababu

తెలంగాణాలో తెలుగుదేశం బలపడుతుందని చంద్రబాబు గారు అనడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. తెలంగాణాలో తెలుగుదేశం ఎప్పటికీ బలపడదు గానీ… తెలుగుదేశం పార్టీ తన కూటమి భాగస్వామి అయిన బీజేపీ తో కలిసి తెలంగాణ ల బలపడనీకి కుట్రలు చెయ్య ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీ కూడా ఇక్కడ మునిగి గల్లంతయ్యే అవకాశాలు ఉద్యమ తెలంగాణల తప్పక ఏర్పడి తీరుతాయని హెచ్చరించారు.

తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవం అన్నారు. అంతే కాదు, అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన బాగున్నదని విస్పష్టంగా ప్రకటించిన చంద్రబాబు గార్కి, తెలంగాణ రాష్ట్రం ల టీడీపీని తిరిగి బలపరుస్తం అని అనవలసిన అవసరం ఏమున్నది? అని ప్రశ్నించారు. వారి కూటమి పార్టీ బీజేపీ కి కూడా తెలంగాణల కాంగ్రెస్ పరిపాలన మంచిగున్నది, మీ నాయకులు ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయవలసిన అవసరం లేదు అని చెప్పటం తప్పక సమంజసంగా ఉంటదన్నారు విజయ శాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version