AP: మానసిక ఆసుపత్రిలో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య..!

-

AP: విశాఖలో విషాదం చోటు చేసుకుంది. మానసిక ఆసుపత్రిలో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నారు. కన్న తల్లిని, పెద్ద నాన్నను హత్య చేసిన ఘటనలో జైలు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి…ఆత్మహత్య చేసుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన అరిమెళ్ళ అశోక్…2022లో తల్లిని హత్య చేశారు. అతనికి బెయిల్ ఇచ్చి సహకరించారు పెదనాన్న. ఇ అతన్ని కూడా హత్య చేశాడు అశోక్.

A remand prisoner committed suicide in a mental hospital

అయితే.. ఇలా ఇద్దరిని హత్య చేయడంతో అతని మానసిక స్థితి బాగాలేదని విశాఖ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మే నెలలో అశోకుని ఒంగోలు నుంచి విశాఖ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ తరుణంలోనే… బాత్రూంలో కిటికీ ఊచలకు బెడ్ షీట్ కట్టి ఉరేసుకున్నాడు. ఈ కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version