నాగుల పంచమి ఎఫెక్ట్.. హైదరాబాద్ లో 5276 పాములను కాపాడారు వాలంటీర్లు. హైదరాబాద్ లో నాగుల పంచమి సందర్భంగా పాములను రెస్క్యూ చేసింది గ్రేటర్ హైదరాబాద్ జంతువుల పై క్రూరత్వ నిరోధక సొసైటీ. ఇప్పటి వరకు 5276 పాములను కాపాడాయి సొసైటీ టీమ్ లు. పలు పాములను రక్షించి, చికిత్స తరువాత అడవిలో వదిలేశారు సొసైటీ వాలంటీర్లు.

నాగుల పంచమి కోసమే నాగుపాములను పట్టుకొని హింసిస్తున్నారు పలువురు. నాగుపాములు కోరలు పీకి వాటికి సరైన ఆహారం కూడా ఇవ్వనట్లు గుర్తించారు. హైదరాబాద్ నగరంలోని శాలిబండ, హుస్సేనీ ఆలం, గౌలిపుర, బేగంబజార్, దాద్‌భౌలి, లాల్‌దర్వాజ, రాంకోఝి, మొఘల్‌పురాలలో దాడులు చేసి పాములను రెస్క్యూ చేసారు సొసైటీ వాలంటీర్లు.