బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్ కు ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. “అన్నయ్య మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే” అని ట్వీట్ చేస్తూ కేటీఆర్ ను ట్యాగ్ చేశారు. ఇదిలా ఉండగా…. గత కొద్ది రోజుల క్రితం మాజీ సీఎం కేసీఆర్ కు కవిత లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీంతో కేటీఆర్, కవిత మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని రాజకీయ వర్గాల్లో అనేక రకాల చర్చలు జరిగాయి.

ఇప్పుడు కవిత కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి దూరం లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కవిత చేసిన ట్వీట్ పై కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇదిలా ఉండగా….ఈరోజు కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, అభిమానులు కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సైతం కేటీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.