హుస్నాబాద్ లో కేసీఆర్ తొలి బహిరంగ సభ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి.. బహిరంగ సభలో హుస్నాబాద్ అభ్యర్థి సతీష్ కి బీ ఫామ్ అందజేశారు కేసీఆర్. మరో ఆరు నెలల్లో లక్ష ఎకరాల్లో నీళ్లు వస్తాయి. కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ అడుగుతోంది. ఒక్క ఛాన్స్ కాదు.. 60 ఏళ్లు అధికార 95 నుంచి 100 సీట్లు గెలిచేందుకు హుస్నాబాద్ నాంది కావాలన్నారు కేసీఆర్.
200 ఉన్న పెన్షన్ ను 1000 పెంచాం. 2018లో రూ.2వేలకు పెంచాం. ఇప్పుడు త్వరలో రూ.5000కి పెంచబోతున్నామని తెలిపారు. మిషన్ భగీరథ లాంటి పకథం ఎక్కడ లేదు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత నాది అని.. నేనే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఓటు మన తలరాతను మారుస్తుంది. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దు. ఎవరో ఏదో చెప్పారని ఆలోచించకుండా ఓటు వేయవద్దు అని సూచించారు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో రాయి ఏదో.. రత్నం ఏదో ఓటర్లు గుర్తించాలన్నారు.