తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. అతి త్వరలోనే జిపిఓల నియామకానికి కసరత్తులు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో త్వరలో గ్రామ పరిపాలన అధికారుల నియామకం చేపట్టనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.

దీనికోసం గతంలో విఆర్ఓ అలాగే వీఆర్ఏలకు పరీక్షలు కూడా నిర్వహించింది. ఇందులో 3454 మంది అర్హత సాధించి రెడీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10954 గ్రామాలకు గ్రామ పరిపాలన అధికారులు కావాల్సి ఉంది. అంటే దాదాపు 7,000 మంది వరకు ఇంకా కావాలి.
మిగిలిన పోస్టులకు కోసం ఆసక్తి కలిగిన పూర్వ విఆర్వో అలాగే వీఆర్ఏలకు మరోసారి పరీక్ష నిర్వహిస్తే.. 3000 మంది వరకు ఎంపిక అయ్యే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఇక మిగిలిన ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని ఆలోచన చేస్తున్నారు.