వనపర్తిలోని మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం తన రికార్డును తానే తిరగరాసింది. 24 గంటల వ్యవధిలో ఈ ఆస్పత్రి వైద్యులు 32 ప్రసవాలు విజయవంతంగా పూర్తి చేశారు. 32 ప్రసవాల్లో 17 సాధారణం కాగా మిగతా 15 మందికి శస్త్రచికిత్సలు చేసినట్లు వైద్యులు తెలిపారు. వాటిలో 13 మందికి మొదటిది కాగా.. 9 మందికి సాధారణ ప్రసవాలు చేసినట్లు వివరించారు.
ఆ ప్రసవాల్లో 20 మంది మగ….. 12 మంది ఆడ శిశువులు జన్మించినట్లు వెద్యులు చెప్పారు. వనపర్తిలో మూడునెలల క్రితం 29 ప్రసవాలు జరగ్గా….. ప్రస్తుతం ఆ రికార్డును అధిగమించినట్లు తెలిపారు. అత్యధిక ప్రసవాలు చేసిన వైద్య సిబ్బందిని…… రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి, ఉన్నతాధికారులు అభినందించారు. తెలంగాణలో ప్రజలకు సర్కార్ వైద్యం పట్ల నమ్మకం పెరిగిందని మంత్రులు హరీశ్, నిరంజన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు అందిస్తున్న సేవలపై ప్రజలకు నమ్మకం పెరిగిందనేందుకు ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు.