హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లో ఉండే నగరవాసులు నల్లాకు మోటర్ పెడితే… భారీ ఫైన్ వేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ వాసులకు తాజాగా వాటర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా నల్లాకు మోటర్ బిగిస్తే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇవ్వడం జరిగింది.

అలా చేస్తే మోటార్స్ ఫీజు చేయడమే కాకుండా కనెక్షన్ కర్తవ పాటు 5000 రూపాయల జరిమానా కూడా విధిస్తామని వాటర్ బోర్డు ఎండి అశోక్ రెడ్డి వెల్లడించారు. నల్లకు మోటర్లు బిగించడం వల్ల వాటర్ సప్లై సమస్యలు ప్రెషర్ సమస్యలు తలెత్తుతున్నాయని… వివరించారు అధికారులు. అందుకే నల్లాకు.. మోటర్లు పెట్టడం నిషేధమని హెచ్చరించారు.