తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రానున్న మూడు రోజుల్లో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ అలాగే సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.

ఇవాల్టి నుంచి మూడు రోజులపాటు 41 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు… వార్నింగ్ బెల్స్ పంపారు. దక్షిణ తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.