కర్ణాటకలో కాంగ్రెస్ అయిదు గ్యారెంటీలు అమలు కావడంలేదని బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సిద్ధరామయ్య తెలంగాణకు వచ్చారు. ఈ సందర్భంగా గాంధీభవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలు అమలు కావడంలేదని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కర్ణాటకలో రోజుకు రూ.62లక్షల మంది ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ప్రతీ వ్యక్తికి 5 కేజీల బియ్యం పంపిణీ చేస్తున్నాం. గృహలక్ష్మీ పథకం జులైలోనే ప్రారంభం అయింది. 200 యూనిట్లలోపు ఉచితంగా కరెంట్ అందిస్తున్నామని తెలిపారు సిద్ధరామయ్య. ఎన్నికల్లో మేము ఇచ్చిన 5 గ్యారెంటీలు కర్ణాటకలో అమలు అవుతున్నాయి. అన్నభాగ్య పథకం కింద 10 కేజీల బియ్యం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చామని.. అలాగే తెలంగాణలో 6 గ్యారెంటీలో తప్పకుండా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపారు.