రిపబ్లిక్ డే వేడుకలలో గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గణతంత్ర దినోత్సవం లో రాజకీయాలు మాట్లాడడం తగదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్ల గవర్నర్ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నానని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతినేలా గవర్నర్ మాట్లాడారని.. గవర్నర్ వైఖరి పై త్వరలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు లేఖ రాస్తామని చెప్పారు.
గవర్నర్ విషయంలో రాష్ట్రపతి కల్పించుకోవాలని కోరారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ ఓ పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం సరైనది కాదన్నారు మంత్రి తలసాని. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు సిఎస్, డీజీపీని పక్కన పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏమిటని విమర్శించారు. సికింద్రాబాద్ డెక్కన్ స్పోర్ట్స్ మాల్ భవనాన్ని సందర్శించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేటి సాయంత్రం నుండి డెక్కన్ మాల్ కూల్చివేత పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.