గిరిజనుల అక్షరాస్యత పెంచుతాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

-

తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం వరాలు కురిపించిన విషయం తెలిసిందే. తెలంగాణకు పంబంధించిన మూడు అంశాలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. జాతీయ పసుపు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు, కృష్ణా ట్రిబ్యునల్ అంశాలపై కీలక నిర్ణయం తీసుకుంది. 

గిరిజనుల అక్షరాస్యత పెంచుతాం.. ట్రైబల్ యూనివర్సిటీ ద్వారా గిరిజనులకు లాభం చేకూరుతుంది. 889 కోట్లతో యూజీడీ ద్వారా వర్సిటీ నిర్వాహణ    కృష్ణా జలాల సమస్యల పరిష్కరించాలని నిర్ణయించాం. కొత్త ట్రిబ్యునల్ కి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. చాలా సంవత్సరాలుగా రైతులు కావాలని జాతీయ పసుపు బోర్డు కోసం డిమాండ్ చేస్తున్నారు. టర్మరిక్ బోర్డు ధరించే వరకు చెప్పులు ధరించమని పోరాటం చేశారు. ఇలాంటి ఈ సమస్యను ప్రధాని పరిష్కారం చేయడం సంతోషకరమన్నారు. దేశవ్యాప్తంగా 3.24లక్షల ఎకరాల్లో పసుపు పండిస్తారు. దేశంలో 12 టన్నుల పసుపు ఉత్పత్తి జరుగుతుంది. 75 శాతం భారతదేశంలోనే పసుపు ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు కిషన్ రెడ్డి. మహారాష్ట్రలో అత్యధికంగా.. ఆ తరువాత తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పసుపు పండిస్తారు. 

Read more RELATED
Recommended to you

Latest news