కల్లుగీత సొసైటీలకు లాభం కలిగేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం – మంత్రి కేటీఆర్

-

2014కు ముందు రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండేవని.. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు సమస్య శాశ్వతంగా పోయిందన్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఫ్లోరైడ్ సమస్య నల్గొండ జిల్లాలో ఉండేదని.. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇంటింటికీ నల్ల నీళ్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో సింహభాగం భూములు బిసిల చేతుల్లో ఉన్నాయన్నారు.

నాడు వ్యవసాయానికి ఎన్నో ఇబ్బందులు ఉండేవని.. ఇప్పుడు వ్యవసాయం పండుగలా మారిందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించుకున్నామని తెలిపారు. దేశంలోని బెస్ట్ గ్రామాలు 19 తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని.. మున్సిపాలిటీలకు అవార్డు ఇస్తే దేశంలో రెండో స్థానంలో తెలంగాణ ఉందన్నారు. నాడు కుల వృత్తులు ద్వంసం అయ్యాయని.. 57 ఏళ్ళు దాటిన వారికి 2016 పెన్షన్ ఇస్తున్నామని పేర్కొన్నారు.

రైతు భీమా తరహాలో గౌడ్స్ కు ఎక్స్ గ్రేషియా తొందరగా వచ్చే ప్రయత్నం చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలోని 4098 కల్లుగీత కుటుంబాలకు 30 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించామన్నారు. కల్లుగీత సొసైటీలకు లాభం కలిగేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version