తెలుగు రాష్ట్రాలను ఇప్పుడు తుఫాన్ భయం వెంటాడుతుంది. ఒక పక్క ఎండలతో కరోనా వైరస్ తో అల్లాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు దూసుకు వస్తున్న తుఫాన్ ఇబ్బందికరంగా మారింది. ఈ తరుణంలో తెలంగాణా వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్,
నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో పాటు దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నెలకొనడంతో… ఏపీలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
రాయలసీమ, దక్షిణ కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని చెప్పారు. ఇక తెలంగాణకు ఎంఫాన్ తుఫాన్ ముప్పు ఉందని అధికారులు పేర్కొన్నారు. దీనితో ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. అయితే తుఫాన్ దశ మార్చుకోవడం తెలంగాణకు ఎంత వరకు ప్రభావం ఉంటుంది అనేది రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుంది.