తెలంగాణలో వెల్ స్పన్ గ్రూప్ పెట్టుబడులు

-

తెలంగాణ రాష్ట్రములో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వెల్‌స్పన్ గ్రూప్‌ సంసిద్ధత వ్యక్తం చేసిందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం డా.బిఆర్ అంబేడ్కర్ సచివాలయములో వెల్‌స్పాన్ గ్రూప్‌ చైర్మన్ బి.కె. గోయెంకా వారి ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. పరిశ్రమల అభివృద్ధికి, పెట్టుబడులను ఆహ్వానించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఫ్రెండ్లీ పాలసీని అనుసరిస్తుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు.

Wellspun Group Investments in Telangana

తమ ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. వెల్‌స్పాన్ గ్రూప్‌ చైర్మన్ బి.కె. గోయెంకా మాట్లాడుతూ.. తమ కంపెనీ భవిష్యత్తులో చందన్ వ్యాలీ పారిశ్రామిక విభాగంలో ప్రారంభించబడిన IT సేవలలో రూ.250 కోట్ల పెట్టుబడి పెడతామని చెప్పారు. టైర్ 2, 3లలోని ఐటిలను అభివృద్ధిపరిచి ప్రమోట్ చేసేందుకు గాను వికారాబాద్, అదిలాబాద్ జిల్లాల్లోని యువతకు IT ఉద్యోగాలను కల్పించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉన్నదని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version