డిసెంబర్ లో చేస్తామన్న రుణమాఫీ ఏమైంది అని ప్రశ్నించారు కేసీఆర్. తాజాగా సిరిసిల్లలో ప్రెస్ మీట్ లో మాట్లాడారు కేసీఆర్. వంద రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని నేను చెప్పానని తెలిపారు. మేము అనుకుంటే అప్పుడు కేసులు పెట్టే వాళ్లం కాదా..? అని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలనే ఆలోచన చేయలేదు.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడున్నోళ్లకు తోక కూడా తెలియదు.
నదులు, బ్యారెజ్ ల వద్ద ఇసుక కొట్టుకుపోవడం సహజం అన్నారు. హైదరాబాద్ లో నీటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి. ప్రతీ ఇంటికి రూపాయికే నల్లా కలెక్షన్ ఇచ్చామన్నారు. రైతులను ఆదుకోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు. అన్ని బ్యారేజ్ ల దగ్గర 200కి పైగా గేట్లు ఉంటాయి.