కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్, కవిత ఎవరి వైపు అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డు నుంచి రాజ్ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకొని అరెస్టుల నుంచి తప్పించుకున్నారు. మీరు ప్రజల వైపు ఉన్నారా..? అదానీ వైపు ఉన్నారా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వాళ్లు రెడీ అంటే అసెంబ్లీలో తీర్మాణం చేద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
అదానీని కాపాడేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. మోడీ కాపాడినా అమెరికా మాత్రం వదిలిపెట్టదన్నారు. ప్రజా స్వామ్యాన్ని, ప్రజాధనాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. అదానీ విషయంలో కేంద్రాన్ని నిలదీయాలా..? వద్దా..? బీఆర్ఎస్ ని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. అదానీ సంస్థలు లంచాలు ఇచ్చినట్టు అమెరికా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇది మన దేశ గౌరవానికి భంగం కలిగించడమే.. అదానీపై విచారణ జరగాలన్నారు. జేపీసీలో చర్చించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కానీ కేంద్రం స్పందించడం లేదు. అందుకే దేశవ్యాప్తంగా రాజ్ భవన్ ల ముట్టడి కార్యక్రమం చేపట్టామని తెలిపారు.