హిందువుల బిల్డింగ్లే కూల్చుతారా…ఓవైసీ బిల్డింగ్లు ఎందుకు కూల్చడం లేదు? – మహేశ్వర్ రెడ్డి

-

హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు పీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. రంగనాథ్ హైడ్రా కమిషనరా..? లేక రాజకీయ నాయకుడా..? అని ప్రశ్నించారు. కేవలం హిందువుల బిల్డింగ్ లని మాత్రమే కూల్చుతారా..? అంటూ మండిపడ్డారు. రంగనాథ్ కి పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అని విమర్శించారు.

ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు ఇస్తూ తనను తాను ప్రమోట్ చేసుకుంటున్నారని.. రంగనాథ్ తన మీద కూడా కామెంట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకి అంత షోకు ఉంటే ఖాకీ బట్టలు విడిచి ఖద్దర్ బట్టలు వేసుకొలని విమర్శించారు మహేశ్వర్ రెడ్డి. రంగనాథ్ కి ఏమైనా రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పారా..? అని ఎద్దేవా చేశారు. రంగనాథ్ సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

హైడ్రా పేరు మీద వసూళ్లకు పాల్పడుతున్నాడని సీఎం తన దృష్టికి వచ్చిందన్నారంటే ఎంత పారదర్శకంగా హైడ్రా నడుస్తుందో అర్థం అవుతుందన్నారు. ఓవైసీ బిల్డింగ్ లో స్టూడెంట్స్ ఉన్నారని… ఇప్పుడు కూల్చం అని రంగనాథ్ అంటున్నారని.. ఓవైసీ కాలేజీకి వర్తించిన నిబంధనలు ఇతరులకు వర్తించవా..? అని విమర్శించారు. కేవలం హిందువుల బిల్డింగులే కూల్చుతారా..? ఓవైసీ బిల్డింగులు ఎందుకు కూల్చడం లేదని మండిపడ్డారు మహేశ్వర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version