నిమజ్జనం రోజు వరంగల్ లో మద్యం అమ్మకాలు బంద్..!

-

ఈ నెల 16 గణేష్ విగ్రహాల శోభయాత్ర, నిమజ్జన కార్యక్రమం వున్న నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో సెప్టెంబర్‌ 16 నాడు మద్యం విక్రయాలను నిలిపివేయాలి అని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాలు జారీ చేసారు. 16 నాడు ఉదయం 6:00 గంటల నుండి మరుసటి రోజు 17 ఉదయం 6:00 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా వైన్ షాపులు, మద్యం సరఫరా చేసే బార్ & రెస్టారెంట్లు, క్లబ్‌లు, హోటళ్ళు మూసివేయాలని పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు సెప్టెంబర్‌ 16న మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే చేస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు. నిబంధనలు పాటిస్తూ శాంతియుతంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరిగేలా సహకరించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు

Read more RELATED
Recommended to you

Exit mobile version