వైసీపీకి రాజినామా చేసిన నేతలకు షాకిస్తున్న టీడీపీ క్యాడర్.. డైలమాలో నేతలు..

-

ప్రభుత్వం మారిపోవడంతో వైసీపీలో పదవులు అనుభవించిన వారందరూ టీడీపీ వైపు చూస్తున్నారు.. ఇప్పటికే కొందరు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేసి.. టీడీపీలో చేరుతామని ప్రకటించారు.. ఇదే సమయంలో వైసీపీ మీద పలు విమర్శలు సంధించారు.. త్వరలోనే పార్టీలో చేరుతారని అందరూ భావించినా.. వారు ఇంత వరకూ టీడీపీ కండువా కప్పుకోలేదు.. ఈ వ్యవహారంపై టీడీపీలో ఆసక్తికరమైన చర్చలు నడుస్తున్నాయి..

రాజ్యసభ సభ్యులుగా ఉంటున్న బీదా మస్తాన్ రావు, మోపిదేవీ వెంకటరమణలు, ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రిపద్మశ్రీలు వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు.. త్వరలోనే టీడీపీలో చేరతారని ప్రచారం కూడా సాగింది.. రాజీనామా చేసి రెండువారాలు గడుస్తున్నా.. తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పుకోలేదు.. దీనికి అనేక కారణాలున్నాయని టీడీపీలో చర్చ నడుస్తోంది..

గతంలో టీడీపీలో ఉన్న బీదామస్తాన్ రావు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరి రాజ్యసభ దక్కించుకున్నారు.. ఆయన తిరిగి స్వంత గూటికి వెళ్లేందుకు క్యాడర్ కు ఎలాంటి ఇబ్బందులు లేవ్.. కానీ పోతుల సునీత విషయంలో మాత్రం స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. పోతుల సునీతను పార్టీలో చేర్చుకోవద్దంటూ క్యాడర్ పెద్దయెత్తున అధిష్టానానికి పిర్యాదులు చేస్తున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. పోతుల సునీత, భర్త పోతుల సురేష్ పరిటాల రవి అనుచరులు కావడంతో గతంలో వారికి టీడీపీ అధిక ప్రాధాన్యత ఇచ్చింది.. కానీ వైసీపీలోకి వెళ్లి చంద్రబాబునేటార్గెట్ గా ఆమె పలు విమర్శలు చేసింది.. దీంతో ఆమె చేరికకు ముఖ్యనేతలే బ్రేక్ వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది..

మోపిదేవీ వెంకటరమణ విషయంలో కూడా స్థానిక నేతలతో పాటు.. క్యాడర్ వ్యతిరేకిస్తోందని తెలుస్తోంది..రేపల్లెలో మంత్రి అనగాని సత్య ప్రసాద్ వర్గం ఆయన చేరికను అడ్డుకుంటోందంట. మోపిదేవి పార్టీలో చేరి.. ఎమ్మెల్సీ దక్కించుకుంటే.. టీడీపీలో గ్రూప్ రాజకీయాలు పెరిగే అవకాశముందని అధిష్టానం దృష్టికి కొందరు నేతలు తీసుకెళ్లారట..దీంతో వారి చేరికపై పార్టీ పునరాలోచనలో పడిందని తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Exit mobile version