తెలంగాణ మందుబాబులకు బిగ్ షాక్. మూడు రోజుల పాటు వైన్స్ షాపులు బంద్ కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని వైన్ షాపులు, బార్లు, కళ్ళు దుకాణాలు బందు కానున్నాయి.
ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 30న ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణ రాష్ట్రంలోని వైన్ షాపులు, బార్లు, కళ్ళు దుకాణాలు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలోని వైన్ షాపులు, బార్లు, కళ్ళు దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
అటు పలు కమిషనరేట్ల పరిధిలో ఈ రోజు సాయంత్రం 5 నుంచి 144 సెక్షన్ అమల్లోకి రానుంది. పోలింగ్‌కు 48 గంటల ముందే తెలంగాణ రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచనలు చేశారు.