మహిళా కొరియోగ్రాఫర్ కు న్యాయం చేస్తాం : మహిళ కమిషన్ చైర్ పర్సన్

-

తెలంగాణ మహిళ కమిషన్ కి జాని మాస్టర్ బాధితురాలు 40 పేజీల ఫిర్యాదు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫిర్యాదు పై తాజాగా తెలంగాణ మహిళా చైర్ పర్సన్ నేరెళ్ల శారదా స్పందించారు. నేను ఛార్జ్ తీసుకుని రెండు నెలలు అవుతుంది. అప్పటి నుండి చాలా కేసులు నా దృష్టి కి వస్తున్నాయి. ఫ్రీవెన్షిన్ ఆఫ్ సెక్సువల్ అర్రాస్ మెంట్ కేసులు ఎక్కువయ్యాయి. ఆడపిల్ల కు పరిమితులు పెట్టడం కరెక్ట్ కాదు. నాలుగు గోడల మధ్య మహిళలను బందించడం కరెక్ట్ కాదు. కోల్ కతా ఘటన లో పని చేసే దగ్గర ఎం జరిగిందో చూసాం. తెలంగాణ రాష్టంలో మహిళలు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి చూస్తున్నారు.

ఫిల్మ్ ఇండస్ట్రీ లో అమ్మాయిలను ఇబ్బందులు పెడుతున్నారు. సొంత మాస్టారు ఇబ్బంది పెడుతుంటే బయటకు వచ్చి ఫిర్యాదు చేసింది. మహిళా కమిషన్ మీద నమ్మకం తో వచ్చానని చెప్పింది. కచ్చితంగా మహిళలు మహిళా కమిషన్ అండగా నిలబడుతుంది. మహిళా కొరియోగ్రాఫర్ కు న్యాయం చేస్తాం. తెలంగాణ రాష్టంలో ఉన్న ప్రతి ఒక్క మహిళా కు మేము అండగా ఉంటాం. కొరియోగ్రాఫర్ మహిళా కు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చాము. సినిమా ఇండస్ట్రీ లో ఉన్న కమిటీ కి సంబందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాము. పని చేసే వద్ద ఎలాంటి అర్రాస్మెంట్ కి గురైనా మహిళలు మా దృష్టికి తీసుకు రావాలని నా విజ్ఞప్తి. ఇలాంటి సందర్భంలో పలుకుబడి ఉన్న వారి నుండి త్రేట్ ఉంటుంది. అయితే ఎంతటి పలుకుబడి ఉన్న మేము మహిళ లకు అండగా ఉంటాము అని చైర్ పర్సన్ నేరెళ్ల శారదా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news