నల్గొండ రైతులకు మరణ శాసనం రాసింది మీరే : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో కృష్ణ జలాల పై సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. తెలంగాణలో SLBC ప్రాజెక్టును 10 కిలోమీటర్ల దూరం పనులు చేపడితే ప్రాజెక్టు పూర్తి అయ్యేది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేవలం 1కిలోమీటర్ న్నర  దూరం మాత్రమే పూర్తి చేశారు. SLBC ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి బీఆర్ఎస్ చేతకానీ తనం కాదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరును ఎండబెట్టింది ఎవరు..? అని ప్రశ్నించారు.

తెలంగాణ హక్కుల కోసం నేను కొట్లాడుతుంటే.. నా కాళ్ల కింద కట్టెలు పెడుతున్నారని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పునర్విభజన బిల్లు రాసిందే నేను అని కేసీఆర్ అన్నారు. మొన్న ఎన్నికలప్పుడు రాత్రికి రాత్రి ఏపీ పోలీసులు ఏకే-47లు పట్టుకొని తెలంగాణలోని సాగర్ డ్యామ్ వద్దకు వచ్చారు. కేసీఆర్ అనుమతి లేనిది ఏపీ పోలీసులు తెలంగాణకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రాజెక్టుల కోసం నల్లగొండ కాదు.. దమ్ముంటే ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయండి అని సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం అవినీతి చర్చకు రావడంతోనే కేఆర్ఎంబీని తెరపైకి తీసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version