తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీటెక్ విద్యార్థి నవీన్ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవీన్ ప్రేమించిన అమ్మాయిని, ప్రేమించిన హరిహర కృష్ణ అమ్మాయి కోసం నవీన్ ను అత్యంత పాశవీకంగా నవీన్ తల, మొండెం వేరుచేసి, వేళ్ళు కత్తిరించి, గుండె బయటకు తీసి, మరణ హోమానికి పాల్పడ్డాడని తెలిసిందే. అయితే నవీన్ హత్య కేసుతో యువతికి ఎలాంటి సంబంధం లేదని రాచకొండ సిపి డిఎస్ చౌహన్ స్పష్టం చేశారు.
హత్యలో యువతి పాత్ర పై ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. నిందితుడు హరిహర కృష్ణ నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నామని, అతడికి సహకరించిన వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. అయితే నిందితుడిలో పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించడం లేదని, అతడు జైలులో ప్రశాంతంగా గడిపాడని సమాచారం. పోలీసుల ప్రశ్నలకు తడబాటు లేకుండా సమాధానాలు ఇచ్చాడట హరిహరకృష్ణ. తాను ఒక్కడినే హత్య చేశానంటూ పదేపదే చెబుతున్నట్లు తెలుస్తోంది.