వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల ఇంట పెళ్లి భజాలు మోగనున్నాయి. కమ్మ వారి అమ్మాయితో షర్మిల కుమారుడు లవ్ మ్యారేజ్ జరుగనున్నట్లు సమాచారం అందుతోంది. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల కుమారుడు రాజారెడ్డి, కమ్మ సామాజికవర్గానికి చెందిన చట్నీస్ సంస్థల అధినేత ప్రసాద్ మనవరాలు ప్రియ అట్లూరితో 4 ఏళ్లుగా అతడు ప్రేమలో ఉండగా.. వీరి వివాహానికి 2 కుటుంబాలు ఆమోదం చెప్పినట్లు సమాచారం.
అయితే.. కమ్మ సామాజికవర్గానికి చెందిన చట్నీస్ సంస్థల అధినేత ప్రసాద్.. చంద్రబాబుకు దగ్గరి బంధువు అని సమాచారం. కాగా, రాజారెడ్డి తండ్రి బ్రాహ్మణ, తల్లి రెడ్డి, వీరిద్దరి కూడా ప్రేమ వివాహమే. షర్మిలను చేసుకున్న తర్వాత అనిల్ క్రైస్తవ మతంలోకి మారిపోయారు. ప్రస్తుతం ఆయన మత బోధకుడిగా కొనసాగుతున్నారు. ప్రియ కుటుంబానిది కమ్మ సామాజిక వర్గం. ఆ మధ్య జగన్ పెద్ద కూతురును రాజారెడ్డికి ఇస్తున్నారని ప్రచారం జరిగింది. తర్వాత ఏమైందో తెలియదు గానీ అది ప్రచారానికే పరిమితం అయిపోయింది.