కాంగ్రెస్ పార్టీలో చేరనున్న వైయస్ షర్మిల… పాలేరు నుంచి పోటీ ?

-

తెలంగాణ వైసిపి పార్టీ జెండా పీకేసేందుకు సిద్ధమయ్యారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీలో చేరికకు వైఎస్ షర్మిలకు లైన్ క్లియర్ అయింది. మధ్యవర్తిత్వం చేసిన కేవీపీ రామచంద్రరావు… షర్మిలను కాంగ్రెస్ పార్టీలో కి తీసుకువచ్చేందుకు బిగ్ స్కెచ్ వేశారు. దీనికి పడిపోయిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారట.

వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి వైయస్ షర్మిల అంగీకారం తెలిపినట్లు కూడా తెలుస్తోంది. అలాగే, పాలేరు నుండి పోటీకి కాంగ్రెస్ అధిష్టానం… కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే ఇలాంటి వార్తలు దాదాపు రెండు నెలల నుంచి వస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో షర్మిల పార్టీని విలీనం చేస్తున్నారన్న వార్తలు వచ్చినప్పుడల్లా వైయస్ షర్మిల క్లారిటీ ఇచ్చారు. తాను ఒంటరిగా పోటీ చేస్తానని… ఏ పార్టీతో పొత్తు గాని, విలీనం కానీ ఉండదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. అయినప్పటికీ తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై షర్మిల ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version