నేడు గజ్వేల్ నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పర్యటన

-

ఇవాళ గజ్వేల్ నియోజకవర్గంలో YSRTP చీఫ్ వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. దళితబందు పథకంలో అక్రమాలపై ప్రశ్నించాలని స్థానికుల నుంచి ఆహ్వానం అందడంతో… ఇవాళ గజ్వేల్‌కు వెళుతున్నారు షర్మిల. ఈ మేరకు షర్మిలకు వినతిపత్రం పంపించారు జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామ వాసులు. ఇటీవల తీగుల్ గ్రామంలో సీఎం దిష్టిబొమ్మ దగ్దం చేసి తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు.

పథకంలో అక్రమాలు జరిగాయని, అర్హులకు దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తీగుల్ గ్రామ ప్రజలు. స్థానిక ప్రజలనుంచి వచ్చిన వినతి మేరకు తీగుల్ గ్రామానికి ఇవాళ ఉదయం 10 గంటలకు వెళ్లనున్నారు షర్మిల. షర్మిల వస్తుందని తెలిసి హెచ్చరికలు పంపుతున్నారు స్థానిక బీఆర్ఎస్ లీడర్లు.

షర్మిల పర్యటనను అడ్డుకుంటామని BRS నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. షర్మిల అంతు చూస్తామని సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులకు దిగుతున్నారు. బీఆర్ఎస్ హెచ్చరికల నేపథ్యంలో భద్రత కల్పించాలని పోలీస్ శాఖకు షర్మిల విజ్ఞప్తి చేశారు. సీఎం ఇలాకా లో జరిగిన అక్రమాలు భయటపడతాయని బీఆర్ఎస్ కి భయం పట్టుకుందని. సొంతనియోజకవర్గంలో ఓడిపోతామనే కేసీఆర్ తన పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ ఈ సందర్భంగా వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version