మనవాళ్లు విదేశాల్లో ప్రధానులు అవుతుంటే.. షర్మిలది రాయలసీమ అనడం ఏంటి? – ys విజయమ్మ

-

వైయస్ షర్మిల పుట్టింది, పెరిగింది, తెలంగాణలోనేనని అన్నారు వైయస్ విజయలక్ష్మి. మనవాళ్లు విదేశాలలో ప్రధానులు అవుతుంటే.. ఇంకా షర్మిలది రాయలసీమ అనడం ఏంటని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకా.. లేదా అనేది వచ్చే ఎన్నికలలో జనం తేల్చుతారని అన్నారు. షర్మిల పార్టీ తెలంగాణలో అన్ని చోట్ల పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను అడిగితే తెలుసుకుంటే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.

ఎన్నో ప్రభుత్వాలు చూసాం కానీ ఇలాంటి వ్యవహారం చూడలేదని మండిపడ్డారు. ఇంకో వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర ఉందని అన్నారు. షర్మిల భయపడే వ్యక్తి కాదన్నారు విజయలక్ష్మి. షర్మిల తెలంగాణ రాజకీయాలలో నిలదొక్కుకుంటుందని.. షర్మిలకు, తెలంగాణకు సంబంధం లేదు అన్నవారికి ప్రజలు ఆన్సర్ చెబుతారని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి అన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version