డైరెక్టర్ శంకర్ నిర్ణయంతో దిల్ రాజుకు కష్టాలు..!!

-

పాన్ ఇండియా దర్శకుడు శంకర్ రాంచరణ్ 15వ సినిమాను స్టార్ట్  చేసిన సంగతి తెలిసిందే.  ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా పూర్తి అయ్యాయి. మరో వైపు శంకర్ కమల్ హాసన్ తో అంతకుముందే ఇండియన్ 2 సినిమాను మొదలుపెట్టారు. అది బడ్జెట్ ప్రాబ్లెమ్ వల్ల ఆగిపోయిన సంగతి అందరికి తెలిసిందే.తాజాగా కోర్టు ఆదేశాల మేరకు గతంలో ఆగిపోయిన  కమల్ సినిమాను మళ్లీ రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది.

దీనితో రాంచరణ్ సినిమా చిక్కుల్లో పడింది.కాని శంకర్ సినిమా నిర్మాత దిల్ రాజుకు , రామ్ చరణ్ కు రెండిటినీ ఏక కాలంలో పూర్తి చేస్తానని హామీ ఇచ్చాడట. అందుకు తగ్గట్టుగానే రెండు సినిమాల షూటింగ్స్ ప్లాన్ చేసాడట. ఈ విషయంపై దిల్ రాజు రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న నిర్మాతలలో దిల్ రాజు ప్లానింగ్ లో ది బెస్ట్ గా ఉంటారు. తాను సినిమా స్టార్ట్ చేస్తున్నాడు అంటే టార్గెట్ పెట్టుకున్న డేట్ లోగా కంప్లీట్ కావలసిందే.

ఎందుకంటే ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ షూటింగ్ ఖర్చులు, దాని మీద వడ్డీల భారం పడుతుంది. అందుకే ప్లానింగ్ మంచిగా చేస్తాడు.కాని RC15కు వచ్చే సరికి శంకర్  నెలలో రామ్ చరణ్ సినిమాకు, కమల్ హాసన్ కు చెరి 12 రోజులు షూటింగ్ కోసం కేటాయించాడట. ఈ విషయం ను ముందే శంకర్ తో డిస్కస్ చేసి సెటిల్ చేశారట. ఇప్పుడు ప్లానింగ్ మొత్తం తలకిందులు అయ్యింది. దీనితో దిల్ రాజుకు ఖచ్చితంగా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version