నన్ను చంపేదుకు కుట్రలు…చేస్తున్నారని వైసీపీ నేత సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై దాడి చేసి చంపేందుకు నారా లోకేష్ కుట్ర చేస్తున్నాడని వైసీపీ నేత సతీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నాయకులే ఈ సమాచారం ఇచ్చారని బాంబు పేల్చారు వైసీపీ నేత సతీష్ రెడ్డి.

నాకు ఏమైనా జరిగితే లోకేష్, బీటెక్ రవిలదే బాధ్యత అన్నారు. సుమోటోగా తీసుకుని సీబీఐ ద్వారా విచారణ చేయించాలి.. రాష్ట్ర ప్రభుత్వ పోలీసులపై నమ్మకం లేదని పేర్కొన్నారు. డీఎస్పీ, రూరల్ సీఐ, డీఐజీ అందరూ తెలుగుదేశానికి తొత్తులుగా పని చేస్తున్నారని వైసీపీ నేత సతీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.