ఇవాళ సాయంత్రం తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం

-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ తదితరులు హాజరయ్యారు.

అనంతరం కీలక విషయాల గురించి మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఆ తరువాత రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలపై  మొదటి ఫైల్ పై సంతకం చేశారు. రెండో ఫైల్ పై దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం అపాయింట్ ఇస్తూ సంతకం చేశారు రేవంత్ రెడ్డి.  తెలంగాణ సచివాలయంలో  రేవంత్ రెడ్డి అధ్యక్షత  మొదటి సమావేశం జరుగనుంది.  సమావేశంలో 6 గ్యారెంటీల అమలు గురించి.. పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రభుత్వం ఏర్పాటు అయింది. కాబట్టి ఏయే నిర్ణయాలు తీసుకోవాలని.. పాలన ఏవిధంగా ఉండాలనే విషయాల గురించి చర్చించనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు తొలి క్యాబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు అందరూ హాజరు కానున్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version